TSPSC Group 4 Jobs : గ్రూప్ 4 ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

ఫిబ్ర‌వ‌రి 3 వ‌ర‌కు లాస్ట్ ఛాన్స్

TSPSC Group 4 Jobs : నిరుద్యోగుల‌కు ఊర‌టనిచ్చేలా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్. ఇప్ప‌టికే గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో భారీ ఎత్తున గ్రూప్ – 4 జాబ్స్(TSPSC Group 4 Jobs) కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం, టీఎస్పీఎస్సీ సర్వ‌ర్ పూర్తిగా మొరాయించ‌డం, ఇబ్బందులు క‌ల‌గ‌డంతో అభ్య‌ర్థులు పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

వెంట‌నే జాబ్స్ ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గ‌డువు పెంచాల‌ని కోరారు. ఇదే స‌మ‌యంలో అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ , హెల్ప్ లైన్ నెంబ‌ర్లు కూడా మొరాయించాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే ప‌ని చేయ‌డం లేదని మండిప‌డ్డారు అభ్య‌ర్థులు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే 82 వేల‌కు పైగా పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు మెడిక‌ల్ బోర్డు, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుతో పాటు టీఎస్పీఎస్సీ భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టాయి.

ఇదిలా ఉండ‌గా ఇప్పటి వ‌ర‌కు నోటిఫికేష‌న్లు వేస్తున్నారే త‌ప్పా ఒక్క పోస్టుకు సంబంధించి నియామ‌క ప‌త్రం ఇవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల సందడి మొద‌లు కానుండ‌డంతో జాబ్స్ భ‌ర్తీ చేస్తున్నారనే విమ‌ర్శ‌లు లేక పోలేదు.

ఈ త‌రుణంలో టీఎస్పీఎస్సీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌రఖాస్తులు ఈ ఏడాది గ్రూప్ 4 కు వ‌చ్చాయి. ఇప్ప‌టికే 8 ల‌క్ష‌లకు పైగా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. రాష్ట్రంలో నిరుద్యోగ ప‌రిస్థితి ఎలా ఉందో చెప్ప‌క‌నే చెబుతోంది.

అభ్య‌ర్థుల నుంచి ఒత్తిడి పెర‌గ‌డంతో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్ 4 జాబ్స్ భ‌ర్తీకి సంబంధించి ఫిబ్ర‌వ‌రి 3 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

Also Read : త‌లొంచిన ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ కు ఆహ్వానం

Leave A Reply

Your Email Id will not be published!