Governor Invite : తలొంచిన ప్రభుత్వం గవర్నర్ కు ఆహ్వానం
తమిళిసైని కలిసిన మంత్రి, అసెంబ్లీ కార్యదర్శి
Governor Invite : తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ వర్సెస్ సీఎం మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగింది. గత కొంత కాలంగా ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ గా ఆధిపత్య పోరు నడిచింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది. గత ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి.
ఈసారి కూడా కీలకమైన రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి తమిళి సై సౌందర రాజన్ లేకుండానే పని కానిచ్చేద్దామని అనుకుంది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం. ఇందుకు సంబంధించి 2023లో ప్రవేశ పెట్టే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నివేదికను ఆమోదం కోసం రాజ్ భవన్ లోని గవర్నర్ కు పంపించింది.
దీనిపై గవర్నర్ తెలివిగా మెలిక పెట్టింది. దీంతో బడ్జెట్ ఆమోదం కావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగబద్దంగా నియమించబడిన గవర్నర్ ఆమోదం తప్పనిసరి అవసరం. దీనిని గమనించిన ప్రభుత్వం ఉన్నట్టుండి తమ మాట వినడం లేదని, కావాలని గవర్నర్ సంతకం చేయడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై కోర్టు తమకు ఈ సమస్యతో సంబంధం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు రాజ్యాంగబద్దంగా గవర్నర్ ఆమోద ముద్ర ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లినా సేమ్ సీన్ ఎదురవుతుందని న్యాయ నిపుణులు చెప్పడంతో గత్యంతరం లేక ప్రభుత్వం తన లంచ్ మోషన్ లో దాఖలు చేసిన పిటిషన్ ను విరమించుకుంది.
చివరకు గవర్నర్ ప్రసంగం తప్పనిసరిగా ఉంటుందని కోర్టుకు తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నర్ కు(Governor Invite) రావాల్సిందిగా కోరింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు. రావాలంటూ కోరారు.
Also Read : గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి