KTR Governor : గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థను ర‌ద్దు చేయాలి

ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్

KTR Governor : ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్లు రాజ్యాంగేత‌ర శ‌క్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు. వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని కేటీఆర్(KTR Governor) డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

దేశంలో న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం పూర్తిగా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను రాజ‌కీయం చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను టార్గెట్ చేస్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు కేటీఆర్. రాష్ట్రానికి ప్ర‌థ‌మ పౌరుడు గా ఉండాల్సిన గ‌వ‌ర్న‌ర్ పూర్తిగా కేంద్రంలో కీలు బొమ్మగా మార‌డం దారుణ‌మ‌న్నారు.

అందుకే తాము గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని చెప్పారు. పూర్తిగా ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మండిప‌డ్డారు కేటీఆర్. గ‌వ‌ర్న‌ర్ల వ‌ల్ల దేశానికి ఎలాంటి ఉప‌యోగం లేద‌న్నారు మంత్రి. రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉన్న వాళ్లు పాలిటిక్స్ కు దూరంగా ఉండాల‌న్నారు. కానీ వాళ్లే పొలిటిక‌ల్ లీడ‌ర్లుగా మారి పోయారంటూ ఎద్దేవా చేశారు.

ఈ దేశంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు. ఇప్ప‌టికైనా విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చేందుకు కృషి చేయాల‌ని కోరారు. ప్ర‌ధాని పేరును వైస్రాయ్ గా మార్చు కోవ‌డ‌మో లేదంటే గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ఎత్తేయ‌డమో చేస్తే దేశానికి చాలా మేలు జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు కేటీఆర్(KTR Governor).

కాజిపేట‌లో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ, బ‌య్యారంలో ఉక్కు కర్మాగారం , తెలంగాణ‌కు విద్యా సంస్థ‌లు, ఇండిస్ట్రియ‌ల్ కారిడార్లు, ఐటీ ఇన్వెస్ట్ మెంట్ రీజియ‌న్ ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌ధాని మోదీ ఇప్ప‌టి వ‌ర‌కు ఊసెత్త‌డం లేద‌న్నారు.

Also Read : గ్రూప్ 4 ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

Leave A Reply

Your Email Id will not be published!