TS Inter Board Row : ముదిరిన ఇంటర్ వాల్యుయేషన్ వివాదం
నవీన్ మిట్టల్ వర్సెస్ మధుసూదన్ రెడ్డి
TS Inter Board Row : తెలంగాణ రాష్ట్రంలో వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ తరుణంలో వాల్యుయేషన్ లొల్లి చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ బోర్డు వర్సెస్ లెక్చరర్స్ అసోసియేషన్ నేత మధుసూదన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది.
తమ సంస్థలో విలువైన డేటా చోరీ చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ సంఘం నేత మధుసూదన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్ బోర్డుకు(TS Inter Board Row) సమాంతరంగా ఇంకో వ్యవస్థ నడుస్తోందంటూ మండిపడ్డారు. దీనికి ప్రధాన కారణం ఆన్ లైన్ లో ఇంటర్ వాల్యూయేషన్ చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
దీని వల్ల సమయం , డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు సెక్రటరీ నవీన్ మిట్టల్. మంత్రి పర్మిషన్ తీసుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న లెక్చరర్ల సంఘం నేత మధుసూదన్ రెడ్డి. కావాలనే రెడ్డి ఇంటర్ బోర్డును అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ నవీన్ మిట్టల్ ఆరోపించారు.
బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని వ్యక్తి దానిపై ఆధిపత్యం చెలాయించాలని యత్నించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇంటర్ కమిషనరేట్ లో సీసీ కెమెరాల టాంపరింగ్ జరిగిందంటూ మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదైంది. మిట్టల్ పై విచారణ జరిపించాలని రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపులతో పాటు సస్పెండైన జూనియర్ లెక్చరర్ మధుసూదన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తే ఎలా అని మిట్టల్ ప్రశ్నించారు.
Also Read : గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి