YS Sharmila KCR : కోర్టుకు ఎక్కిండు నవ్వుల పాలైండు
సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల సెటైర్
YS Sharmila KCR : వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె సీఎం కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు. అదే పనిగా తాను 80 వేల పుస్తకాలు చదివిన అని చెప్పే కేసీఆర్ ముందు రాజ్యాంగాన్ని సరిగా చదివితే బెటర్ అని సూచించారు. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలు తప్ప ఒక్క మాటైనా నిజం మాట్లాడిన పాపాన పోలేదన్నారు షర్మిల. రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేని కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను కించ పర్చేలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
పొద్దస్తమానం కమీషన్లపై ఉన్నంత ఫోకస్ పాలనపై లేకుండా పోయిందని మండిపడ్డారు వైఎస్ షర్మిల(YS Sharmila). ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన సీఎం రాష్ట్ర పరువును తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో తయారు చేసిన రాజ్యాంగాన్ని ముందు కూలంకుశంగా చదవాలని హితవు పలికారు. తన పాలనకు అడ్డుగా ఉందనే నెపంతో గవర్నర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ నిర్వహించాలని ప్లాన్ చేశాడని, ఆపై కోర్టుకు ఎక్కి అభాసు పాలయ్యాడని చివరకు భంగపాటుకు గురై కాళ్ల బేరానికి వచ్చాడని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల(YS Sharmila). ప్రతిసారి కోర్టుకు వెళ్లడం చీవాట్లు తినడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు.
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
Also Read : తలొంచిన ప్రభుత్వం గవర్నర్ కు ఆహ్వానం