President Address : రాష్ట్రపతి ప్రసంగం సమావేశాలు ప్రారంభం
మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఆఖరి బడ్జెట్
President Address : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వ పదవీ కాలానికి సంబంధించిన చివరి పూర్తి బడ్జెట్ ఇది కావడం విశేషం. ప్రజలను ఆకర్షించేలా ఎలాంటి భారం పడకుండా ఉండేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను తయారు చేసినట్లు టాక్.
ఇక విపక్షాలు సైతం దాడి చేసేందుకు రెడీ అయ్యాయి. సరిగ్గా మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ , రాజ్యసభ ను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Address) ప్రసంగించారు. ఇదిలా ఉండగా అదానీ వివాదం, ద్రవ్యోల్బణం , నిరుద్యోగం వంటి ప్రధాన అంశాలు చర్చకు ప్రధానంగా రానున్నాయి. వీటిపైనే విపక్షాలు ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నాయి.
ఈ సెషన్ 27 సమావేశాలను కలిగి ఉంటుంది. ఫిబ్రవరి 13 , మార్చి 12 మధ్య నెల రోజుల విరామంతో ఏప్రిల్ 6న ముగుస్తుంది. సెషన్ కు ముందు 27 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 37 మంది నేతలతో అఖిలపక్షం సమావేశం జరిగింది.
లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రావాలనే అంశంపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఇక కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ సజావుగా నడిపేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కోరారు.
ఎల్ఐసీ , ఎస్బీఐ అదానీ గ్రూప్ లో భారీగా పెట్టుబడులు పెట్టాయని దీనిపై విచారణ జరగాలని కోరారు ఆప్ నేత సంజయ్ సింగ్.
Also Read : ఇది నిర్భయ..నిర్ణయాత్మక ప్రభుత్వం