President Murmu : ఇది నిర్భయ..నిర్ణయాత్మక ప్రభుత్వం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన
President Murmu : దేశంలో నిర్భయ, నిర్ణయాత్మక ప్రభుత్వం ఇవాళ ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu). బడ్జెట్ సమావేశాల సందర్బంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి జనవరి 31 మంగళవారం ప్రసంగించారు రాష్ట్రపతి. నియంత్రణ రేఖ నుంచి వాస్తవ నియంత్రణ రేఖ వరకు భద్రత , జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 , ట్రిపుల్ తలాక్ రద్దు అంటి అంశాలను ప్రస్తావించారు ద్రౌపది ముర్ము.
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోందన్నారు రాష్ట్రపతి. ఇవాళ నిర్భయ, నిర్ణయాత్మక ప్రభుత్వం కొలువు తీరి ఉందని, దేనినైనా ఎదుర్కొనే సత్తా కలిగి ఉందని స్పష్టం చేశారు ద్రౌపది ముర్ము. ప్రభుత్వం త్వరలో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోనుందని , ఇవాళ అతి పెద్ద మార్పు ఏమిటంటే ప్రతి భారతీయుడు అత్యంత విశ్వాసంతో అంతకు మించిన నమ్మకంతో ఉన్నారని చెప్పారు రాష్ట్రపతి.
అంతే కాదు ఇవాళ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే స్థాయికి భారత్ వెళ్లిందన్నారు. ప్రపంచంలో చోటు చేసుకున్న సమస్యలకు పరిష్కారంగా మారుతోందన్నారు ద్రౌపది ముర్ము(President Murmu). స్వయం ఆధారిత, మానవతా బాధ్యతలను తన భుజానికి ఎత్తుకుందన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుందన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తోందని స్పష్టం చేశారు రాష్ట్రపతి.
ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగం భారత రాజ్యాంగానికి గర్వ కారణమని పేర్కొన్నారు ప్రధాన మంత్రి మోదీ. దేశంలోని గొప్ప గిరిజన సంప్రదాయాలను , మహిళలను గౌరవించే అవకాశం ఉందన్నారు.
Also Read : రాష్ట్రపతి ప్రసంగానికి సోనియా హాజరు