BS Yediyurappa : వయస్సు భారం ఎన్నికలకు దూరం
మాజీ సీఎం యెడియూరప్ప ప్రకటన
BS Yediyurappa : కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప సంచలన ప్రకటన చేశారు. తన వయస్సు ఇప్పుడు 80 ఏళ్లు దాటిందని ఇక తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేయదల్చు కోలేదన్నారు. తాజాగా ఆయన చేసిన ఈ ప్రకటన భారతీయ జనతా పార్టీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే దక్షిణాదిన ట్రబుల్ షూటర్ గా పేరొందారు యెడియూరప్ప(BS Yediyurappa).
ఆయన అర్ధాంతరంగా సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఒక రకంగా బీజేపీ హైకమాండ్ పొమ్మన లేక పొగ పెట్టింది. ప్రస్తుతం కర్ణాటక లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యూహాలు పన్నుతూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ తరుణంలో పార్టీకి పెద్ద దిక్కుగా భావించే యెడియూరప్ప ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తనంతకు తానుగా తీసుకున్నారా లేక పార్టీ కోరిందా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే కన్నడ నాట కాషాయ జెండా ఎగుర వేయడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం యెడియూరప్పనే(BS Yediyurappa). రాజకీయ రంగంలో చాణుక్యుడిగా పేర్కొంటారు తెలిసిన వారంతా. తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం లేదంటూ ప్రకటించారు.
మరికొందరు మాత్రం తన కుమారుడిని మరోసారి పోటీలోకి దించాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గెలిపించేందుకు సర్వ శక్తులా కృషి చేస్తానని అన్నారు.
Also Read : కొలీజియంపై కేంద్రం జోక్యం తగదు