Supreme Court : ఎలక్టోరల్ బాండ్ స్కీంపై విచారణ
మార్చిలో విచారించనున్న సుప్రీంకోర్టు
Supreme Court : నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ స్కీంను తీసుకు వచ్చింది. కోట్లాది రూపాయలు రాజకీయ పార్టీలకు కల్పతరువుగా మారాయి ఈ బాండ్స్ . దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను వచ్చే మార్చి నెలలో విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ ,జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం(Supreme Court) ఈ కేసును మార్చి మూడో వారంలో విచారణకు వాయిదా వేసింది.
2017 నుంచి పెండింగ్ లో ఉన్న ప్రధాన విషయంలో కాంగ్రెస్ నాయకుడు జయ ఠాకూర్ పిటిషన్ దాఖలు చేశారు. పొలిటికల్ పార్టీలకు అనామక నిధులను అనుమతించే ప్రభుత్వ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సవాల్ చేశారు. ఈ పిటిషన్ తో పాటు మరో రెండు పిటిషన్లు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానంలో దాఖలయ్యాయి.
ఒకటి రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకు రావడం, రాజకీయ నిధుల కోసం విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) కింద ధ్రువీకరణకు సంబంధించి మరొకటి భిన్నమైనవని పేర్కొంది. ఈ మూడు కేసులు వేటికవే భిన్నమైనవని పేర్కొంది.
ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలని గతంలో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్ అనేది ప్రామిసరీ నోట్ లేదా బేరర్ బాండ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ పార్టీలకు నిధులను అందించడం కోసం ప్రత్యేకంగా బాండ్లను జారీ చేస్తారు.
Also Read : ఎన్డీఏ వైఫల్యం అందుకే బహిష్కరించాం