Ajit Doval Mark Milley : మార్క్ మిల్లీతో అజిత్ దోవ‌ల్ భేటీ

కీల‌క అంశాల‌పై ప్ర‌ధాన‌గా చ‌ర్చ

Ajit Doval Mark Milley : జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ కె దోవ‌ల్ అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మ‌న్ జ‌న‌ర‌ల్ మార్క్ మిల్లీతో స‌మావేశం అయ్యారు.(Ajit Doval Mark Milley) ఈ ఇద్ద‌రి భేటీ కావ‌డం కీల‌కంగా మారింది. ప్రాధాన్య‌త సంత‌రించుకుంది కూడా. యుఎస్ లోని భార‌త రాయ‌బారి త‌రంజిత్ సింగ్ సంధు అధికారిక నివాసంలో క‌లుసుకున్నారు. ఈ కీల‌క ములాఖ‌త్ లో కార్పొరేట్లు, విద్యావేత్త‌లు, థింక్ ట్యాంక్ లు హాజ‌ర‌య్యారు.

భార‌త్ – అమెరికా ద్వైపాక్షిక స‌హ‌కారానికి సంబంధించిన వివిధ అంశాల‌పై ఫ‌ల‌వంత‌మైన చ‌ర్చ‌ను నిర్వ‌హించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను, స‌వాళ్ల‌ను చ‌ర్చించారు. ఓ వైపు భార‌త్ ర‌ష్యాతో స‌త్ సంబంధాల‌ను కొన‌సాగిస్తూ వ‌స్తోంది.

ఇక భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ అమెరికాలో ప‌ర్య‌టించ‌డం ఆస‌క్తిని రేపుతోంది. సామాన్యంగా దోవ‌ల్ ఎక్క‌డికీ వెళ్ల‌రు. ఏదైనా ఉప‌ద్ర‌వం ముంచు కొస్తుంది అనుకుంటే అక్క‌డ వాలిపోతారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న వెనుక ఎన్నో అనుమానాలు మ‌రెన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతాయి.

ఈ కీల‌క భేటీలో అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జేక్ సుల్లివ‌న్ , వాణిజ్య కార్య‌ద‌ర్శి గినా రైమోండో, విదేశాంగ డిప్యూటీ సెక్ర‌ట‌రీ వెండి షెర్మాన్ , నేష‌న‌ల్ సైన్స్ ఫౌండేష‌న్ డైరెక్ట‌ర్ సేతురామ‌న్ పంచ‌నాథ‌న్ , నాసా అడ్మినిస్ట్రేట‌ర్ బిల్ నెల్స‌న్ తో స‌హా బైడెన్ ప‌రిపాల‌న శాఖ‌లోని ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

వీరితో పాటు అమెరికాకు చెందిన లింక్డ్ ఇన్ కో ఫౌండ‌ర్ నాస్ డాక్ , మైక్రోన్ , లాక్ హీడ్ మార్టిన్ , అప్లైడ్ మెటీరియ‌ల్స్ , గ్లోబ‌ల్ ఫౌండ్రీస్ , జ‌న‌ర‌ల్ అట్లాంటిక్ , జ‌న‌ర‌ల్ అటామిక్స్ , జ‌న‌ర‌ల్ క్యాటలిస్ట్ సిఇఓలు ఉన్నారు.

Also Read : భార‌తీయుల‌పై ఖ‌లిస్తానీ గ్రూప్ దాడి

Leave A Reply

Your Email Id will not be published!