Union Budget 2023 : సరైన మార్గంలో ఆర్థిక రంగం – నిర్మల
పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి
Union Budget 2023 : భారత ఆర్థిక రంగం సరైన మార్గంలో నడుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ లో బుధవారం కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన బడ్జెట్ 2023 ను(Union Budget 2023) ప్రవేశ పెట్టారు . ఈ సందర్బంగా కీలక ప్రసంగం చేశారు నిర్మలా సీతారామన్. ఆర్థిక వృద్ది పరిధిని విస్తృతం చేయడం, మౌలిక సదుపాయాలు, తయారీ వంటి కీలక రంగాలను పెంచడం , ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించామని చెప్పారు.
ఆర్థిక వృద్దిని పెంచడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంపై కేంద్ర సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారను నిర్మలా సీతారామన్. భారత దేశ ఆర్థిక వ్యవస్థ అనేక ప్రపంచ కారకాలు కీలకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, నిరుద్యోగిత రేటు, జీడీపీ వృద్ది మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్ర మంత్రి బడ్జెట్ ను సమర్పించారు.
అమృత్ కాల్ లో ఇది మొదటి బడ్జెట్. ఇది మునుపటి బడ్జెట్ , 100 వంద భారత దేశం కోసం రూపొందించిన బ్లూ ప్రింట్ ద్వారా వేయబడిన పునాదిపై నిర్మించాలని భావిస్తోంది. తన బడ్జెట్(Union Budget 2023) ప్రసంగంలో మౌలిక సదుపాయాలు, తయారీ, ఉద్యోగాల కల్పన వంటి కీలక రంగాలను పెంచడంపై ఫోకస్ పెట్టామన్నారు.
సవాళ్లు ఉన్నప్పటికీ ఉజ్వల భవిష్యత్తు దిశగా పయనిస్తోందని అన్నారు నిర్మలా సీతారామన్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చే ఏడాది పాటు ప్రాధాన్యత ఉన్న కుటుంబాలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చసే పథకాన్ని అమలు చేసిందన్నారు మంత్రి.
Also Read : దేశపు జెండా పేరుతో అదానీ మోసం