Union Budget 2023 Karnataka : కర్ణాటకకు మోదీ నజరానా
బడ్జెట్ లో భారీగా కేటాయింపు
Union Budget 2023 Karnataka : అంతా అనుకున్నట్టే జరిగింది. ఇది కేవలం సంఖ్యల బడ్జెట్ తప్ప దేశానికి ఒరిగేది ఏమీ లేదని తేలి పోయింది. సామాన్యులకు అందుబాటులోని బడ్జెట్ గా మారి పోయింది. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకపై నరేంద్ర మోదీ ఎక్కువ ప్రేమ చూపించారు. ఆ మేరకు ఆ రాష్ట్రానికి ఏకంగా రూ. 5,300 కోట్లు కేటాయించారు(Union Budget 2023 Karnataka) ప్రస్తుతం ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో.
బుధవారం పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఇంత భారీ ఎత్తున ఒక్క రాష్ట్రానికి కేటాయించడంపై సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఓ వైపు తన స్నేహితుడిగా భావించే అదానీ గ్రూప్ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది.
అమెరికా సంస్థ హిడెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు ఒక్కసారిగా షేర్లు పడి పోయాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న అదానీ ఉన్నట్టుండి 11వ స్థానానికి దిగజారాడు. దీనిపై కూడా చర్చ జరగనుంది. ఇది పక్కన పెడితే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే భారీ ఎత్తున నిధులు కేటాయించినట్లు అర్థం అవుతోంది.
ఇంత భారీ ఎత్తున నిధులను కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించి నీటి పారుదల శాఖకు కేటాయించడం విశేషం. వీటిని కర్ణాటక లోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు ప్రకటించారు. తుంగభద్ర నదిపై గల భద్ర రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టు ఎత్తిపోతల కింద 17.40 టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది కర్ణాటక సర్కార్.
Also Read : వ్యవసాయ రంగానికి రుణ సాయం