PM Modi Budget 2023 : ప్రజలందరికీ అనువైన బడ్జెట్ – మోదీ
ఇది దేశ అభివృద్దికి మేలు చేకూర్చేది
PM Modi Budget 2023 : పార్లమెంట్ సాక్షిగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా అంతా నిరాశే మిగిలిందని విపక్షాలు మండి పడుతున్నాయి. కాగా మరో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఇది అద్భుతమైన బడ్జెట్ గా అభివర్ణించారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేసిన బడ్జెట్ గా పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన అనంతరం లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. అమృత్ కాల్ లో ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ ఇదే మొదటిది అని పేర్కొన్నారు పీఎం. దేశ అభివృద్దికి ఈ బడ్జెట్ మరింత బలాన్ని, పురోభివృద్ది సాధించేందుకు దోహదం చేస్తుందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరి ఆశలకు అనుగుణంగా రూపు దిద్దుకున్నదని చెప్పారు నరేంద్ర మోదీ.
సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు, రైతులతో సహా ప్రతి ఒక్కరికి ఎంతో సహకారం ఉంటుందన్నారు. మహిళలకు ఈసారి బడ్జెట్ లో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు ప్రధానమంత్రి(PM Modi Budget 2023). సీనియర్ సిటిజన్లకు మేలు చేకూర్చేలా డిపాజిట్ స్కీం లో పెట్టుబడిని రెట్టింపు చేయడంం జరిగిందని తెలిపారు.
మహిళా సాధికారత సాధించేలా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు. గతంలో ప్రభుత్వాలు పట్టించు కోలేదని ఆరోపించారు మోదీ. కానీ తాము మాత్రం ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో బడ్జెట్ ను రూపొందించడం జరిగిందన్నారు.
Also Read : నీతి ఆయోగ్ మూడేళ్ల పాటు పొడిగింపు