Mamata Banerjee Visva Bharati : సీఎంకు యూనివర్శిటీ షాక్
మీ ఆశ్వీర్వాదం లేకుండా ఉత్తమం
Mamata Banerjee Visva Bharati : పశ్చిమ బెంగాల్ లో మరో వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య యూనివర్శిటీలు కేరాఫ్ గా మారడం విస్తు పోయేలా చేసింది. విశ్వ భారతి విశ్వ విద్యాలయం యూనివర్శిటీ నిర్వహణపై ఫోకస్ పెట్టాలని , విద్యార్థులను కాషాయీకరణ నుంచి కాపాడాలని స్పష్టం చేశారు సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee). నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కు కేటాయించిన స్థలం తమదేనంటూ ఇటీవల యూనివర్శీటీ నోటీసులు పంపింది.
దీనిపై సీరియస్ గా స్పందించారు మమతా బెనర్జీ. ఇందుకు సంబంధించిన భూమి హక్కు పత్రాలను తానే స్వయంగా వెళ్లి అమర్త్య సేన్ కు అందజేసింది. దీనిపై స్పందించిన యూనివర్శిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మీ ఆశీర్వాదం లేకుండా ఉత్తమంగా ఉన్నామని పేర్కొంది.
ఇదిలా ఉండగా బేషరతుగా అమర్త్య సేన్ కు విశ్వ భారతి విశ్వ విద్యాలయం క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన యూనివర్శిటీ తమ జోలికి ఎలా వస్తారంటూ ప్రశ్నించింది. ఇప్పువడు అమర్త్య సేన్, యూనివర్శిటీ మధ్య వివాదం రాజకీయ రంగు పులుముకుంది. సీఎంకు వ్యతిరేకంగా యూనివర్శిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటనపై విశ్వ భారతి అధికార ప్రతినిధి మహూవా బెనర్జీ సంతకం చేయడం విశేషం. అంతకు ముందు ఈ భూమిని అమర్త్యసేన్ తండ్రి అశు తోష్ సేన్ కు ఇచ్చారని యూనివర్శిటీ ఆరోపించినట్లుగా అక్రమ కబ్బా లేదని ప్రభుత్వ పరంగా రికార్డులను సీఎం అందజేశారు.
Also Read : చెరసాలను వీడిన సిద్దిక్ కప్పన్