TTD Vishnu Parayanam : తిరుమలలో శ్రీ విష్ణు పారాయణం
పాల్గొన్న భక్త బాంధవులు
TTD Vishnu Parayanam : తిరుమల వీధులు విష్ణు సహస్ర నామంతో హోరెత్తుతున్నాయి. ఓ వైపు భక్తులు మరో వైపు గోవింద నామ జపాలతో దద్దరిల్లుతోంది. శ్రీ విష్ణు సహస్ర నామ సామూహిక పారాయణం ఘనంగా నిర్వహించారు.
పెద్ద ఎత్తున ఈ భక్తి కార్యక్రమానికి హాజరయ్యారు భక్తులు. తిరుమల లోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం , జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్ర పారాయణం నిర్వహించారు ఘనంగా.
అంతకు ముందు తిరుమల వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు కోగంటి రామానాజాచార్యులు విష్ణు సహస్ర నామాన్ని(TTD Vishnu Parayanam) జపించడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. దానిని పఠించడం వల్ల, లేదా జపించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని తెలిపారు.
సంస్కృత విద్యా పీఠం ఉప కులపతి ఆచార్య కృష్ణ మూర్తి , ఎస్వీ వేద విశ్వ విద్యాలయం ఆచార్యులు శ్రీనాథాచార్యులు శ్రీ విష్ణు సహస్ర నామ స్త్రోత్ర విశిష్టత గురించి సోదారణంగా వివరించారు.
దీంతో పాటు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్త్రోత్రమ్ , పూర్వ పీఠిక శ్లోకాలు పారాయణం చేశారు. విష్ణు సహస్ర నామ స్త్రోత్రం 108 శ్లోకాలను మూడు సార్లు , ఉత్తర పీఠిక లోని 34 శ్లోకాలను పఠించారు. నారాయణతే నమో నమో .. శ్రీ వెంకటేశం మనసా స్మరామీ.. శ్రీ వేంకటేశ్వర నామ సంకీకర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 5 నుచి అత్యాధునికంగా నిర్మించిన పరకామణి భవనంలో శ్రీవారి కానుకలు లెక్కిస్తారు.
Also Read : సమతా కుంభ్ ఉత్సవాలు ప్రారంభం