Radhika K Viswanath : మాట‌లు రావ‌డం లేదు – రాధిక‌

ఆయ‌న వద్ద ఎన్నో నేర్చుకున్నా

Radhika K Viswanath : క‌ళాత‌ప‌స్వి మ‌ర‌ణం న‌న్ను బాధ‌కు గురి చేసింది. తండ్రి లాంటి వారు ఆయ‌న‌. అంత‌కు మించి నాకు గురుతుల్యులు. ఇవాళ ఆయ‌న లేర‌న్న వార్త న‌న్ను కోలుకోలేకుండా చేసింద‌న్నారు ప్ర‌ముఖ న‌టి రాధిక శ‌ర‌త్ కుమార్. విశ్వ‌నాథ్ లోకాన్ని వీడార‌ని తెలిసిన వెంట‌నే తాను ఇక్క‌డికి వ‌చ్చాన‌ని అన్నారు. శుక్ర‌వారం విశ్వ‌నాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు రాధిక‌(Radhika K Viswanath).

స్వాతి ముత్యం సినిమాలో నాకు ద‌ర్శ‌కుడు అవ‌కాశం ఇచ్చారు. ఆ సినిమా త‌న కెరీర్ లో ఊహించ‌ని గుర్తింపు తీసుకు వ‌చ్చింద‌న్నారు. ఆ త‌ర్వాత తాను వెన‌క్కి చూడ‌లేద‌న్నారు. ఎన్నో పాత్ర‌లు చేసినా అలాంటి పాత్ర త‌న‌కు రాలేద‌న్నారు. ఇప్ప‌టికీ ఎల్ల‌ప్ప‌టికీ తాను క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ కు రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు రాధికా శ‌ర‌త్ కుమార్.

ఆయ‌న ఇవాళ భౌతికంగా లేరు అన్న విష‌యం ఇంకా న‌మ్మ‌లేక పోతున్నాన‌ని పేర్కొన్నారు. క‌ళాత‌ప‌స్వి నుంచి తాను న‌ట‌నా ప‌రంగా ఎంతో నేర్చుకున్నాన‌ని చెప్పారు ప్ర‌ముఖ న‌టి. ఇదిలా ఉండ‌గా మ‌రో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ అని పేర్కొన్నారు.

ఆయ‌న మ‌ర‌ణించార‌న్న వార్త వినేందుకు చాలా బాధ‌గా ఉంద‌న్నారు ఆర్జీవీ. ఆయ‌న వెళ్లి పోయారు. కానీ క‌ళాత‌ప‌స్వి చేసిన సినిమాలు ఎప్ప‌టికీ జీవించి ఉంటాయ‌ని పేర్కొన్నారు.

కాగా క‌ళాప‌త‌స్విని ఎన్నో అవార్డులు , పుర‌స్కారాలు వ‌రించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయ‌న‌న‌ను ఘ‌నంగా స‌త్క‌రించింది. 1992లో ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది.

Also Read : కె విశ్వ‌నాథ్ మ‌హానుభావుడు

Leave A Reply

Your Email Id will not be published!