Sundaresh Menon CJI : సీజేఐతో సింగపూర్ జడ్జి ముచ్చట
బెంచ్ ను పంచుకున్న మీనన్
Sundaresh Menon CJI : సింగపూర్ ప్రధాన న్యాయూమర్తి సుందరేష్ మీనన్ సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంపై కూర్చున్నారు. 2012 నుంచి సింగపూర్ కు నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు జస్టిస్ మీనన్. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ కీలకమైన కార్యక్రమం జరిగింది.
ఇందులో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా భారత్ కు వచ్చారు. ఇదిలా ఉండగా భారత దేశం రిపబ్లిక్ అయిన రెండు రోజుల తర్వాత 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ సుందరేశ్ మీనన్(Sundaresh Menon) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మారుతున్న ప్రపంచంలో న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు జస్టిస్ సుందరేష్ మీనన్.
ఈ సమావేశానికి సీజేఐ, సుప్రీంకోర్టు, హైకోర్టుల సీనియర్ మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు, అత్యున్నత న్యాయస్థానం అధికారులు, సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి , సీజేఐ డాక్టర్ ధనంజయ వై చంద్రచూడ్ , సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో రెండు న్యాయ వ్యవస్థల మధ్య మరింత సహకారం చట్ట పరమైన, న్యాయ విద్య, జ్ఞానాన్ని పంచుకునే అవకాశాల గురించి చర్చించారు.
Also Read : మోదీ సర్కార్ పై సుప్రీం సీరియస్