Raghunandan Rao : తెలంగాణ పోలీసుల‌కు అన్యాయం

బీహార్ పోలీసుల‌కే ప్ర‌యారిటీ

Raghunandan Rao : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు(Raghunandan Rao )సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ పై మండిప‌డ్డారు. రాష్ట్రంలో బీహార్ అధికారుల‌దే హ‌వా కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు.

తెలంగాణ‌లో అనుభ‌వం క‌లిగిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఉన్నా వారిని ప‌ట్టించు కోవ‌డం లేదంటూ మండిప‌డ్డారు. ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా 93 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను బ‌దిలీ చేశార‌ని, వారిలో తెలంగాణ‌కు చెందిన వారికి ఒక్క‌రికీ కూడా ప్రాధాన్య‌త క‌లిగిన పోస్టుల్లో కేటాయించ లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా అత్యంత ప్ర‌యారిటీ క‌లిగిన డీజీపీ, అడిష‌న‌ల్ డీజీపీ, ఐజీ హైద‌రాబాద్ రేంజ్ జోన్ పోస్టుల‌ను కూడా మొత్తం బీహార్ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తుల‌కే క‌ట్ట‌బెట్టారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు. దీన్ని బ‌ట్టి చూస్తే గ‌తంలో కేసీఆర్ మూలాలు ఏపీలో ఉన్నాయ‌ని అనుకునే వాళ్ల‌మ‌ని అన్నారు.

కానీ ఇవాళ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప‌రిస్థితుల‌ను , బ‌దిలీల‌ను, కేటాయించే పోస్టుల‌ను బ‌ట్టి చూస్తే క‌ల్వ‌కుంట్ల బాస్ మూలాల‌న్నీ బీహార్ లో ఉన్న‌ట్లు అర్థం అవుతున్నాయ‌ని ఎద్ద‌వా చేశారు. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు మొత్తం బీహార్ వాసుల‌కు మేలు చేకూర్చేలా ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం బీహార్ జ‌పం చేస్తున్నార‌ని వీళ్లేనా ప్ర‌జాప్ర‌తినిధులు అన్న అనుమానం క‌లుగుతోంద‌ని మండిప‌డ్డారు ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు. ఇప్ప‌టికే చీఫ్ సెక్ర‌ట‌రీ గా గ‌తంలో ఉన్న సోమేశ్ కుమార్ హ‌యాంలో రాష్ట్రాన్ని జ‌ల‌గ‌లా పీల్చుకు తిన్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : ముమ్మాటికీ క‌ల్వ‌కుంట్ల కుటుంబ పాల‌నే

Leave A Reply

Your Email Id will not be published!