Congress Slams Adani : అదానీపై విచారణ చేపట్టాలి – కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ షాకింగ్ కామెంట్స్
Congress Slams Adani : అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కంటిన్యూగా పతనం చెందుతూనే ఉన్నాయి. పనామా, పండోర పేపర్లలో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ పేరు ఉండగా అదానీ గ్రూప్ దర్యాప్తు సంస్థల రాడార్ లోకి ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ(Congress Slams Adani) ప్రశ్నించింది. అమెరికాకు చెందిన రీసెర్చ్ గ్రూప్ హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు షేర్లు ఢమాల్ అయ్యాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో 2వ స్థానంలో ఉన్న అదానీ ఉన్నట్టుండి 22వ స్థానానికి పడి పోయాడు.
కించిత్ అనుమానం కలిగినా లేదా ఆరోపణలు వచ్చినా వెంటనే వాలి పోయే సీబీఐ, ఈడీ , ఐటీ సంస్థలు ఎందుకు దాడులు చేయడం లేదంటూ నిలదీసింది. దీని వెనుక మోదీ ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థిక నేరగాళ్లపై తమ ధృఢ వైఖరి ఏమైందని , ఎందుకు ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారంటూ ఫైర్ అయ్యింది.
ఇలా ఎంత కాలం అదానీని వెనకేసుకు వస్తారంటూ ప్రశ్నించింది. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేపట్టాలని గత కొంత కాలంగా కాంగ్రెస్ కోరుతోంది.
ఇదే విషయాన్ని పార్లమెంట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇంత జరుగుతున్నా నిర్మలా సీతారామన్ చిలుక పలుకులు పలుకుతోందంటూ మండిపడింది పార్టీ. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై ఏ కేంద్ర ఏజెన్సీ ఎందుకు స్పందించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దేశానికి అతీతుడా ఏమైనా జాతిపితా అని పేర్కొంది.
Also Read : అదానీ గ్రూప్ కు సిటీ గ్రూప్ షాక్