BRS MLAS Case : తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి
BRS MLAS Case : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతా రావు, బీరం హర్ష వర్దన్ రెడ్డిలను బీజేపీ ప్రోద్బలంతో కొనుగోలు చేసేందుకు యత్నించారనే ఆరోపణలు కలకలం రేపాయి.
దీనిపై నమోదైన కేసుకు సంబంధి కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది. అంతే కాదు ఎమ్మెల్యేల కొనుగోలు(BRS MLAS Case) వ్యవహారం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు సంచలన తీర్పు చెప్పింది. దీంతో విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. గత కొంత కాలంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తెర దించింది రాష్ట్ర హైకోర్టు.
ఇదిలా ఉండగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సీబీఐకే అప్పగిస్తూ తీర్పు చెప్పడం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ కేసును గత నెల జనవరి 18న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పును రజర్వ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరగక పోయినా ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్ కు ఆన్సర్ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
Also Read : బీఆర్ఎస్ షాక్ పొంగులేటి బిగ్ షాక్