Telangana Budget 2023-2024 : బడ్జెట్ లో ప్రజా సంక్షేమానికి పెద్దపీట
సాగు..గ్రామాలకు భారీగా నిధులు కేటాయింపు
Telangana Budget 2023-2024 : తెలంగాణ ప్రభుత్వం 2023-2024 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా వ్యవసాయ, గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటయించింది. ఇందులో ఎక్కువగా ప్రజా సంక్షేమానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చింది ప్రభుత్వం. పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు , పురపాలిక శాఖకు రూ. 11,372 కోట్లు , రోడ్లు భవనాలకు రూ. 2,500 కోట్లు , పరిశ్రమలకు రూ. 4,037 కోట్లు , హోమ్ శాఖకురూ. రూ. 9,599 కోట్లు కేటాయించింది(Telangana Budget 2023-2024) .
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కోసం రూ. 200 కోట్లు, రాష్ట్రంలో మరో 60 జూనియర్ , సీనియర్ సివిల్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేసింది. కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతాల కోసం రూ. 1,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. వచ్చే ఏప్రీల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేస్తామని వెల్లడించారు.
సెర్ప్ ఉద్యోగుల పే స్కేల్ సవరణ కూడా చేస్తామన్నారు. అంతే కాకుండా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకానికి రూ. 12,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రుణ మాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి. ఇదిలా ఉండగా ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ప్రత్యేకించి త్వరలో ఎన్నికలు రానుండడంతో దానిని దృష్టిలో పెట్టుకునే ఈ బడ్జెట్ ను రూపొందించిందని విపక్షాలు ఆరోపించాయి.
ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ , వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ అంటూ మండిపడ్డారు.
Also Read : బీఆర్ఎస్ లో చేరే ప్రసక్తి లేదు – జేడీ