Lata Mangeshkar Anniversary : ల‌తా మంగేష్క‌ర్ వీడి ఏడాది

ఫిబ్ర‌వ‌రి 6 న లోకాన్ని వీడిన గాన కోకిల‌

Lata Mangeshkar Anniversary : గాన కోకిల లతా మంగేష్క‌ర్ ఈ లోకాన్ని వీడి నేటితో ఫిబ్ర‌వ‌రి 6తో ఒక ఏడాది పూర్త‌యింది. చూస్తూ ఉండ‌గానే కాలం వెళ్లి పోతోంది. ఆమె వ‌ర్ధంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మోదీ తో పాటు ప్ర‌ముఖులు ల‌తను గుర్తు చేసుకున్నారు. త‌న గాత్ర మాధుర్యంతో ఈ ప్ర‌పంచాన్ని ఉర్రూత లూగించారు. స‌రిగ్గా ఇదే రోజు క‌న్ను మూశారు. ఈ సంద‌ర్బంగా ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar) మేన కోడ‌లు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

నా ఫోన్ రింగ్ అయిన‌ప్పుడ‌ల్లా దీదీ నాకు ఫోన్ చేస్తున్న‌ట్లు అనిపిస్తుంద‌ని వాపోయారు. ఆమె 92 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ర‌ణించారు గ‌త ఏడాది 2022 ఫిబ్ర‌వరి 6న‌.

భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గొప్ప గాయ‌నిగా గుర్తింపు పొందారు. ఏడు ద‌శాబ్దాల కాలంలో అనేక పాట‌లు పాడారు. ఎన్నో భాష‌ల‌లో అల‌రించారు. త‌న గాత్రంతో ఎంద‌రినో మైమ‌రిచి పోయేలా చేశారు ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar). ఆమె లాగ్ జా గ‌లే , మోహే పంఘ‌ట్ పే, చ‌ల్తే చ‌ల్తే , స‌త్యం శివం సుంద‌రం , అజీబ్ దాస్తాన్ హై, హోతోన్ మే ఐసీ బాత్ , ప్యార్ కియాతో డ‌ర్నా క్యా , నీలా ఆస్మాన్ సో గ‌యా , పానీ పానీ రే వంటి మ‌రుపురాని పాట‌లు పాడారు.

రోజంతా ఆమె స్వ‌రం వినిపిస్తూనే ఉంది. ఆమె లేర‌న్న‌ది ఇంకా జీర్ణించు కోలేక పోతున్నామ‌ని అంటున్నారు అభిమానులు, న‌టీన‌టులు. సంగీత కారులు..ద‌ర్శ‌కులు. ఆమె దేవుడిని న‌మ్ముకుంది. కానీ ఆమె గొంతులో దైవ‌త్వం దాగి ఉంద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. ఆమెకు మ‌ర‌ణం లేద‌న్నారు పంక‌జ్ ఉధాస్.

Also Read : న‌ర్సుల వివాదం బాల‌య్య ప‌శ్చాతాపం

Vani Jayaram : గాయ‌ని వాణీ జ‌య‌రాం ఇక లేరు

Leave A Reply

Your Email Id will not be published!