YS Sharmila KCR : ఇది కల్వకుంట్ల బడ్జెట్ – వైఎస్ షర్మిల
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని బడ్జెట్
YS Sharmila KCR : ఇది ప్రజల కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కాదని కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రజా ప్రస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర మంగళవాం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు షర్మిల(YS Sharmila).
పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ప్రస్తావనే లేదన్నారు. నిరుద్యోగుల ఊసే లేదన్నారు. 24 గంటల విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఆమె మరోసారి నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్ పై. కొత్త సీసాలో పాత సారాను నింపినట్లుగా ఉందని ఈ బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు.
గత ఏడాది బడ్జెట్ ను కాపీ చేసి పేస్ట్ చేసినట్లుగా ఉందని మండిపడ్డారు. ప్రధాన రంగాలను పట్టించు కోలేదని ఆరోపించారు వైఎస్ షర్మిల. ప్రభుత్వం కేటాయించిన నిధులకు ఖర్చు చేస్తున్న కోట్లకు అస్సలు పొంతన లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. సీఎం మాటలు కోటలు దాటుతాయే తప్ప చేతలు కావన్నారు. ఈ ఎనిమిదన్నర ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదని తీవ్ర కామెంట్స్ చేశారు షర్మిల(YS Sharmila).
రుణ మాఫీ కోసం 36 లక్షల మంది రైతులు ఎదురు చూస్తుంటే బడ్జెట్ లో కేవలం 6 వేల కోట్లు మాత్రమే ఎలా కేటాయిస్తారంటూ నిలదీశారు వైఎస్ షర్మిల.
Also Read : బడ్జెట్ లో ప్రజా సంక్షేమానికి పెద్దపీట