Shakuntalam Movie : శాకుంతలం విడుదల వాయిదా
త్వరలో ప్రకటిస్తామన్న మూవీ టీం
Shakuntalam Movie : దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో ప్రముఖ నటి సమంత నటించిన శాకుంతలం చిత్రం విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు.
అంతకు ముందు కూడా ఒకసారి పోస్ట్ పోన్ చేశారు. చివరకు సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఈ చిత్రం కోసం. చావు కబురు చల్లగా చెప్పారు మరోసారి వాయిదా పడిందని. ట్విట్టర్ వేదికగా అధికారికంగా చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. అనివార్య కారణాల వల్ల శాకుంతలం మూవీని వాయిదా(Shakuntalam Movie) వేస్తున్నట్లు వెల్లడించింది.
కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయ్యాక నటి సమంత కన్నీటి పర్యంతమైంది. ఆమె గత కొంత కాలం నుంచి వింత వ్యాధితో బాధ పడుతోంది. కానీ సినిమా అద్భుతంగా వచ్చిందంటూ పేర్కొంది నటి.
ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ,పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర నిర్మాతతో పాటు దర్శకుడు, చిత్ర యూనిట్ తెగ ముచ్చట పడ్డారు. కానీ వాయిదా పడుతూ వస్తుండడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
మంచి రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. కానీ ఉన్నట్టుండి 17న విడుదల చేయడం లేదంటూ చెప్పడంపై మరింత ఉత్కంఠ నెలకొంది. అసలు సినిమా పూర్తయిందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి శాకుంతలం వాయిదా పడుతుందంటూ ప్రచారం జరిగింది. అది ఇవాళ్టి మూవీ టీం ప్రకటనతో వాస్తవమేనని తేలింది.
Also Read : కాశ్మీర్ ఫైల్స్ పనికి మాలిన సినిమా