Rahul Gandhi Adani : పార్ల‌మెంట్ లో అదానీపై రాహుల్ ఫైర్

మంత్రులు వ‌ర్సెస్ కాంగ్రెస్ నేత

Rahul Gandhi Adani : అదానీ గ్రూప్ హింటెన్ బ‌ర్గ్ వివాదంపై పార్ల‌మెంట్ లోని లోక్ స‌భ , రాజ్య‌స‌భ ద‌ద్ద‌రిల్లింది. ప్ర‌తిప‌క్షాలు అదానీపై విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశాయి. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం బేష‌ర‌తుగా గౌత‌మ్ అదానీకి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని, అందు వ‌ల్ల‌నే మోసానికి పాల్ప‌డ్డాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi).

అదానీ వ్యాపార సామ్రాజ్యానికి అన్ని రంగాల‌లో స‌హాయం చేశాడని మండిప‌డ్డారు. కేంద్ర మంత్రులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌టించిన ప్ర‌తి దేశంలో గౌతమ్ అదానీ కాంట్రాక్టులు పొందాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ. హిండెన్ బ‌ర్గ్ కొట్టిన దెబ్బ‌కు అదానీ కంపెనీల విలువ సుమారు 120 బిలియ‌న్ డాల‌ర్లు కోల్పోయారు. పార్ల‌మెంట్ లో మంగ‌ళ‌వారం రాహుల్ గాంధీ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. షాకింగ్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

దేశంలోని ప్ర‌తి రంగంలో అదానీ గ్రూప్ ఎంట‌ర్ అయ్యింద‌ని, దీనికి లోపాయికారిగా ప్ర‌ధాన‌మంత్రి మ‌ద్ద‌తు ఇస్తున్నాడ‌ని ఫైర్ అయ్యారు. 2014 నుంచి 2022 మ‌ధ్య గౌత‌మ్ అదానీ నిక‌ర విలువ 8 బిలియ‌న్ డాల‌ర్ల నుండి 140 బిలియ‌న్ల‌కు ఎలా పెరిగింద‌ని మోదీని ప్ర‌శ్నించారు కాంగ్రెస్ నేత‌.

బీజేపీ కేంద్రంలోకి రాక ముందు గౌత‌మ్ అదానీ ర్యాంకు 600 ర్యాంకు ఉండేద‌ని, 2014 త‌ర్వాత ఈ మ‌ధ్య కాలంలో ఏకంగా ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 2వ స్థానంలోకి ఎగ‌బాకాడ‌ని ఎలా సాధ్య‌మైంద‌ని ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

Also Read : జేపీ న‌డ్డా ప‌నితీరు భేష్ – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!