Rahul Gandhi Modi : మోదీ పాలనలోనే ఎదిగిన అదానీ
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Modi : ప్రధాన మంత్రి మోదీకి వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. అసలు అదానీతో ఉన్న బంధం ఏమిటో నరేంద్ మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరి 31న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు పార్లమెంట్ లోని ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అదానీ హిండెన్ బర్గ వివాదంపై నిలదీశారు. చర్చించాలని పట్టు పట్టారు. ఈ మేరకు ప్రతిపక్షాలన్నీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం అదానీపై తీవ్ర స్థాయిలో నిలదీశారు ఎంపీ రాహుల్ గాంధీ.
ఒక రకంగా మోదీని, బీజేపీని కడిగి పారేశారు. ఒకప్పుడు 600వ ర్యాంకులో ఉన్న అదానీ ఉన్నట్టుండి మోదీ వచ్చాక 2వ స్థానానికి ఎలా చేరుకున్నాడంటూ నిప్పులు చెరిగారు. ఇవాళ తాను కోరడం లేదని దేశం యావత్తు తెలుసు కోవాలని అనుకుంటోందన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
బిలియనీర్ వ్యాపారవేత్త వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఏమిటో తెలుసు కోవాలని ఉందన్నారు. నిన్నటి దాకా రాసుకు పూసుకు తిరిగిన మోదీ ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్రభుత్వంపై దాడికి దిగారు. ప్రభుత్వం అదానీపై చర్చను కోరుకోవడం లేదని ఎందుకో భయపడుతోందన్నారు. లక్షల కోట్ల అవినీతి బయట పడాలని అన్నారు.
Also Read : పార్లమెంట్ లో అదానీపై రాహుల్ ఫైర్