PM Narendra Modi : ఓటర్లు చేయలేనిది ఈడీ చేసింది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Narendra Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మధ్యన పదే పదే ప్రతిపక్షాలు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారంటూ కేంద్ర సర్కార్ పై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ దేశంలో ఓటర్లు, ప్రజలు చేయలేని పనిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిందని కొనియాడారు ప్రధానమంత్రి. దేశం సాధిస్తున్న పురోభివృద్దిని చూసి తట్టుకోలేక పోతున్నాయంటూ మండిపడ్డారు.
తన సర్కార్ పై ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను తిప్పి కొట్టారు. గత కాలంలో ఏలిన వారి హయాంలో హత్యలు, అవినీతి , ఉగ్రవాదం చోటు చేసుకుందని ఆరోపించారు నరేంద్ర మోదీ(PM Narendra Modi). తాను కష్టపడి పైకి వచ్చానని, తనకు కష్టం ఏమిటో తెలుసన్నారు. పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రతి ఒక్కరినీ తాను ప్రేమిస్తానని చెప్పారు. ఈ దేశంలోని 140 కోట్ల ప్రజలందరికీ మేలు చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
దేశానికి స్వేచ్ఛ లభించిన తర్వాత 2004-2014 కాలంలో దేశంలో అవినీతి పేరుకు పోయిందన్నారు. ఆ పదేళ్లలో జరిగిన అన్యాయం వందేళ్లకు సరిపడా జరిగిందని ఆరోపించారు. ఇది పూర్తిగా సంక్షోభానికి దారి తీసేలా చేసిందన్నారు ప్రధానమంత్రి. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
తనను విమర్శిస్తున్న వాళ్లకు ఒక్కటే సమాధానం. నేను విమర్శలు పట్టించుకోను. సానుకూల దృక్ఫథంతోనే నేను ముందుకు వెళతా. నాకు భవిష్యత్తు పట్ల నమ్మకం ఉంది. దేశానికి బలమైన నాయకత్వం అవసరం. దానిని నేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు నరేంద్ర మోదీ.
Also Read : గత పాలకుల నిర్వాకం అవినీతిమయం