Madhya Pradesh CM : రూ. 100 కోట్లతో రవిదాస్ ఆలయం
ప్రకటించిన సీఎం శివరాజ్ చౌహాన్
Madhya Pradesh CM : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. రూ. 100 కోట్లతో గురు రవిదాస్ ఆలయాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా మత గురువు రవిదాస్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు కలిగి ఉన్నారు.
15వ శతాబ్దపు కాలం నాటి సాధువు, కవిగా గుర్తింపు పొందారు. ఆయన స్మారకార్థం జరిగిన రవిదాస్ మహా కుంభ్ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. భక్తితత్వాన్ని ప్రబోధించిన మహానుభావుడు రవిదాస్ అని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక కవిగా, సాధువుగా,సంఘ సంస్కర్తగా దేశమంతటా ఆదరణ కలిగి ఉన్నారు రవిదాస్. రాష్ట్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో సంత్ రవిదాస్ ఆలయాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్(Madhya Pradesh CM).ఈ సాధువు అంటే దళితులకు ప్రత్యేకమైన అభిమానం. అంతే కాకుండా రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ క్లస్టర్లలో 20 శాతం ప్లాట్లను షెడ్యూల్డు కులాలు , షెడ్యూల్డు తెగల వారి కోసం రిజర్వ్ చేయనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం వెల్లడించారు.
సాగర్ సమీపంలోని బర్తుమా గ్రామంలో సంత్ రవిదాస్ ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు శివరాజ్ సింగ్ చౌహాన్. యుద్ద ప్రాతిపదికన ఆలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాల సభ్యులకు కూడా ప్రభుత్వ స్టోర్ కొనుగోలు నిబంధనల్లో సడలింపు కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందన్నారు మధ్య ప్రదేశ్ రాష్ట్ర సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్ .
Also Read : ఇందిరను చూసి గుణపాఠం నేర్చుకోవాలి