PM Modi Ashwini Vaishnaw : మోదీ ఐడియా రైల్వే మంత్రి ఫిదా

రూఫ్ ఫ్లాజాలు ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌ధాని

PM Modi Ashwini Vaishnaw : సానుకూల దృక్ఫ‌థం క‌లిగి ఉండ‌డాన్ని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న అంకురాల‌ను ప్రోత్స‌హిస్తారు. పీఎంగా కొలువు తీరిన వెంట‌నే మేకిన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దిశ‌గా అడుగులు వేయాల‌ని పిలుపునిచ్చారు. ఇదే స‌మ‌యంలో కీల‌క‌మైన ఆవిష్క‌ర‌ణ‌లు సృష్టించే వారిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు.

అంతే కాకుండా జాతిని ఉద్దేశించి ప్ర‌తి నెలా మూడో వారంలో మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం ద్వారా ఔత్సాహికుల‌ను , క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వారి విశేషాల‌ను , సమాజానికి మార్గ‌ద‌ర్శ‌కంగా, దేశానికి దిక్సూచిగా మారే ఐడియాల గురించి దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ చేస్తారు. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి వ‌చ్చిన ఐడియాకు ఏకంగా రైల్వే శాఖ మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్(PM Modi Ashwini Vaishnaw) ఫిదా అయ్యారు.

రైల్వే స్టేష‌న్ల‌లో రూఫ్ ప్లాజా ఏర్పాటుపై ప్ర‌ధాన‌మంత్రికి ఉన్న విజ‌న్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌నల‌తో ముంచెత్తారు. న‌రేంద్ర మోదీకి ఉన్న ముందు చూపు , వినూత్న ఆలోచ‌న‌ల‌ను ప్ర‌శంసించారు అశ్వ‌ని వైష్ణ‌వ్. మా కంటే 50 ఏళ్లు ముందుకు ఆలోచిస్తార‌ని ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించారు కేంద్ర మంత్రి.

ప్రాథ‌మికంగా 50 రైల్వే స్టేష‌న్ల‌లో రూఫ్ ప్లాజాల‌ను ఏర్పాటు చేయాల‌ని త‌మ‌కు సూచించార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ ఆలోచ‌న‌లు భిన్నంగా, వినూత్నంగా ఉంటాయ‌ని కొనియాడారు.

రైల్వే ట్రాక్ ల‌పై రూఫ్ ప్లాజాల‌ను ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల కొంత మేలు జ‌రుగుతుంద‌ని త‌మ‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పార‌ని తెలిపారు రైల్వే శాఖ మంత్రి.

Also Read : రూ. 100 కోట్లతో ర‌విదాస్ ఆల‌యం

Leave A Reply

Your Email Id will not be published!