PM Modi Rahul Gandhi : నెహ్రూ పేరెందుకు పెట్టుకోలేదు
రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన ప్రధాని
PM Modi Rahul Gandhi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. రాహుల్ , సోనియా, ప్రియాంక గాంధీ అని పేరు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. నెహ్రూ అని పేరు పెట్టుకోవడానికి ఎందుకంత భయ పడుతున్నారంటూ నిలదీశారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ఏక్ అకకేలా కిత్నో కో భారీ అంటూ మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ టోకనిజం, ఓటు బ్యాంకు రాజకీయాలు, సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంలో ఆసక్తి చూపడం లేదంటూ నరేంద్ర మోదీ ఆరోపించారు.
ఆర్టికల్ 356ని విపరీతంగా దుర్వినియోగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీనేనంటూ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం విస్తు పోయేలా చేసింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు మరింత బురద చల్లుతున్నాయటూ సంచలన ఆరోపణలు చేశారు నరేంద్ర మోదీ(PM Modi Rahul Gandhi).
ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించినా తమకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు ప్రధానమంత్రి. ఒక రకంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నెహ్రూ – గాంధీ కుటుంబంపై 600 సంక్షేమ పథకాలకు పేరు పెట్టారని ఈ విషయం తాను ఇటీవలే తెలుసుకున్నానని చెప్పారు మోదీ. మరి సోనియా ఫ్యామిలీ తమ ఇంటి పేరును గాంధీకి బదులు దివంగత దేశ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పేరు ఎందుకు పెట్టుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఇందిరా గాంధీని టార్గెట్ చేశారు ప్రధానమంత్రి. కాంగ్రేసేతర ప్రభుత్వాలను కూల్చేందుకు 50 సార్లు ఉపయోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : మోదీ ఐడియా రైల్వే మంత్రి ఫిదా