ISRO Satellites : ఇస్రో ప్రయోగం విజయవంతం
నింగిలోకి దూసుకెళ్లిన ఉపగ్రహాలు
ISRO Satellites : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగం విజయవంతం అయ్యింది. మూడు ఉపగ్రహాలు సక్సస్ కావడంతో సంబురాలు చోటు చేసుకున్నాయి సంస్థలో. శుక్రవారం ఉదయం 9.15 నిమిషాలకు ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ ను(ISRO Satellites) ప్రయోగించింది ఇస్రో. ఇందులో రెండు భారత దేశానికి చెందినవి కాగా మరొకటి అమెరికాకు చెందిన ఉపయోగం (రాకెట్) కావడం విశేషం.
అర్ధరాత్రి 2.48 గంటలకు ఇస్రోలో కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 156.3 కిలోల బరువున్న ఈవోఎస్ -07 , 8.7 కేజీల బరువు కలిగిన ఆజాదీశాట్ -02 రాకెట్, యుఎస్ లోని అంటారీస్ సంస్థకు చెందిన 11.5 కేజీల బరువు కలిగిన జానూస్ -01 ఉపగ్రహాన్ని రోదసీలోకి విజయవంతంగా పంపించారు. ఇదిలా ఉండగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అరుదైన చరిత్ర లిఖించింది.
అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను రాకెట్ లోకి పంపించిన దేశంగా నిలిచింది. ఇందుకు సంబంధించి భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఇస్రో చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాకెట్ లు పంపించేలా కృషి చేయాలని సూచించారు. వచ్చే మార్చి నెలలో ఎల్వీఎం -3 రాకెట్ ప్రయోగం ద్వారా 36 గ్రహాలను నింగిలోకి పంపించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
ఏపీలోని తిరుపతి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి మూడు మినీ, మైక్రో, నానో ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో నిర్దేశించిన మిషన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. నిర్దేశించిన సమయం కంటే తక్కువ లోపే ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించామని ప్రకటించింది.
Also Read : భారత్ ఆఫ్గాన్ ప్రజలను వదులుకోదు – దోవల్