CM KCR Assembly : ఇక నుంచి గిరిజ‌న బంధు – కేసీఆర్

రైతు బంధు త‌ర‌హాలో ఇస్తామ‌న్న సీఎం

CM KCR Assembly : అడ‌వి బిడ్డ‌ల‌కు, గిరిజ‌నుల‌కు శుభ‌వార్త చెప్పారు సీఎం కేసీఆర్(CM KCR Assembly) . ఇక నుంచి రైతు బంధు త‌ర‌హాలోనే గిరిజ‌న బంధు ప‌థకాన్ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీలో గురువారం కేసీఆర్ ప్ర‌సంగించారు. ఈ నెలాఖ‌రులో పోడు భూములను పంపిణీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. పంపిణీ చేసిన త‌ర్వాత రైతు బంధు, విద్యుత్ , సాగు నీటి సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అడ‌వి బిడ్డ‌ల‌కు ద‌ళిత బంధును వ‌ర్తింప చేస్తామ‌మ‌ని చెప్పారు.

త‌మ వ‌ద్ద రాష్ట్రంలో పోడు భూములు ఎన్ని ఉన్నాయో ఉన్నాయ‌ని తెలిపారు. 66 ల‌క్ష‌ల ఎక‌రాల అట‌వీ భూములు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అట‌వీ భూముల‌కు సంబంధించి నివేదిక‌లు ఉన్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల‌కు చెందిన నాయ‌కులు గ‌నుక ఒప్పుకుంటే 11.5 ల‌క్ష‌ల ఎక‌రాలు పంపిణీ చేస్తామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదే స‌మ‌యంలో అట‌వీ అధికారుల‌పై దాడులు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు సీఎం. గ‌తంలో పాల‌కులు ఎన్నో మోసాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. ఆ విష‌యం అడ‌వి బిడ్డ‌ల‌కు తెలుస‌న్నారు. పోడు భూముల పేరుతో రాజ‌కీయం చేస్తే ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు కేసీఆర్. 

విచ‌క్ష‌ణ ర‌హితంగా అడ‌వుల‌ను న‌రికి వేస్తామంటే స‌రికాద‌న్నారు. ఆచి తూచి ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఖ‌మ్మం జిల్లాలో అట‌వీ భూముల‌ను క‌బ్జా చేసుకున్నార‌ని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా న‌ర్సాపూర్ అడ‌వి ఎలా మాయ‌మైందో క‌ళ్ల‌కు క‌నిపిస్తోంద‌న్నారు కేసీఆర్.

ఇదే స‌మ‌యంలో గిరిజ‌నుల‌పై పోలీసులు , అట‌వీ అధికారులు దాడులు చేయొద్దంటూ ఆదేశించారు.

Also Read : అధికారంలోకి వ‌స్తం కూల్చుతం – బండి

Leave A Reply

Your Email Id will not be published!