TikTok Layoffs : టిక్ టాక్ ఉద్యోగుల‌కు షాక్

భార‌త్ లో మొత్తానికి తొల‌గింపు

TikTok Layoffs : ప్ర‌పంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు అన్ని రంగాలు విల విల లాడుతున్నాయి. ఇప్ప‌టికే ఐటీ, లాజిస్టిక్ , ఫార్మా, మీడియా, సోష‌ల్ , డిజిట‌ల్ మీడియా ప్లాట్ ఫార‌మ్ ల‌లో తొల‌గింపుల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉన్న‌ది.

ఉద్యోగుల తొల‌గింపు ప‌ర్వానికి మొద‌ట‌గా శ్రీ‌కారం చుట్టింది టెస్లా చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్. ఎప్పుడైతే మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాడో ఆనాటి నుంచి తొల‌గించ‌డం ప్రారంభించాయి మిగ‌తా దిగ్గ‌జ కంపెనీల‌న్నీ. ఎలోన్ మ‌స్క్ 9 వేల మందికి పైగా సాగ‌నంపాడు. వీరిలో ప‌ర్మినెంట్ , కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు.

గూగుల్ 10 వేల మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేలు , మెటా ఫేస్ బుక్ 10 వేలు, అమెజాన్ 18 వేల మందిని సాగ‌నంపింది. తాజాగా సెర్చింగ్ ఇంజ‌న్ యాహూ కూడా ఏకంగా 20 శాతం జాబ‌ర్స్ ను ఇంటికి పంప‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సిఇఓ .

మ‌రో వైపు ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియా ప్లాట్ ఫార‌మ్ లో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ షార్ట్ వీడియోస్ , చాటింగ్ సెక్టార్ లో టాప్ లో కొన‌సాగుతున్న చైనాకు చెందిన టిక్ టాక్(TikTok Layoffs) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేర‌కు ఆర్థిక మాంద్యం ప్ర‌భావం కార‌ణంగా తాము ఉద్యోగుల‌ను భ‌రించే స్థితిలో లేమ‌ని ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టికే టిక్ టాక్ ను భార‌త దేశంలో కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించింది. మ‌రో వైపు అమెరికా ప్ర‌భుత్వం కూడా స‌ర్కార్ కు సంబంధించిన వారు ఎవ‌రూ కూడా టిక్ టాక్ ను వాడ కూడ‌దంటూ వార్నింగ్ ఇచ్చింది. పూర్తిగా బ్లాక్ చేస్తున్న‌ట్లు తెలిపింది.

తాజాగా టిక్ టాక్ భార‌త్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఉద్యోగులంద‌రినీ విధుల నుంచి తొల‌గిస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా యాప్ ప్ర‌క‌టించింది. చావు క‌బురు చ‌ల్ల‌గా తెలిపింది.

Also Read : ఉద్యోగుల‌కు యాహూ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!