Supreme Court BBC Modi : బీబీసీ మోదీ పై నిషేధం కుదరదు
తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
Supreme Court BBC Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. పీఎం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ ఆరోపించింది. ఈ మేరకు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో లేకుండా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నిషేధానికి సంబంధించి ఉత్తర్వులను కూడా జారీ చేసింది.
దీనిపై బీబీసీ మోదీ డాక్యుమెంటరీని నిషేధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు(Supreme Court BBC Modi). ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది. తీవ్ర వివాదానికి దారి తీసిన బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం చెల్లదంటూ కుండ బద్దలు కొట్టింది. ఈ మేరకు దావాను కొట్టి వేస్తున్నట్లు స్పష్టం చేసింది ధర్మాసనం.
ఇదిలా ఉండగా బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం విధించాలంటూ ప్రముఖ సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పు పట్టింది. ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది కోర్టు. కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టుకు చేరింది. బీబీసీ కావాలనే ఉద్దేశ పూర్వకంగానే మోదీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందంటూ ఆరోపించారు పిటిషనర్.
డాక్యుమెంటరీలు దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని ప్రశ్నించింది. హిందూ సంస్థలు బీబీసీ ఛానల్ ను దేశంలో సెన్సార్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పనిలో పనిగా కేంద్ర సర్కార్ కు నోటీసు జారీ చేసింది.
మూడు వారాల లోగా పూర్తి నివేదిక సమర్పించాలని, బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన రికార్డ్ సమర్పించాలని ఆదేశించింది కోర్టు.
Also Read : ఇస్రో ప్రయోగం విజయవంతం