Adani Row : అదానీ మోసం ప్యాన‌ల్ ఏర్పాటుకు ఆదేశం

ఇన్వెస్ట‌ర్ల ర‌క్ష‌ణ‌కు ప్యానెల్ ఏర్పాటు చేయాలి

Adani Row : అదానీ గ్రూప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అమెరికాకు చెందిన హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ గ్రూప్ కొట్టిన దెబ్బ‌కు భారీ ఎత్తున న‌ష్టం వాటిల్లింది. ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న గౌత‌మ్ అదానీ షేర్ల ప‌త‌నంతో ఏకంగా 22వ స్థానానికి ప‌డి పోయాడు. ల‌క్ష‌ల కోట్ల ఆదాయం కోల్పోయాడు. అంతే కాకుండా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌హ‌కారంతోనే గౌత‌మ్ అదానీ ఇలా మోసానికి(Adani Row) పాల్ప‌డిన‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి.

ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వ ఆధీనంలోని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లు వేల కోట్లు పెట్టుబ‌డిగా పెట్టాయి. దీంతో పెద్ద ఎత్తున కోట్లాది మంది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశాయి.

దీంతో భారీ న‌ష్టానికి పాల్ప‌డడంతో ముందు జాగ్ర‌త్త‌గా ఇన్వెస్ట‌ర్ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండేందుకు ప్ర‌త్యేకంగా ప్యానెల్ ను ఏర్పాటు చేయాల‌ని భార‌త‌దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం ఆదేశించింది. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రంలో కొలువుతీరిన మోదీ ప్ర‌భుత్వానికి సూచించింది.

తాము విధాన ప‌ర‌మైన విష‌యాల్లోకి ప్ర‌వేశించాల‌ని కోరుకోవ‌డం లేద‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం. అయితే భార‌తీయ పెట్టుబ‌డిదారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు తెలిపింది. అయితే అదానీ గ్రూప్ పై వ‌చ్చిన మోసం ఆరోప‌ణ‌ల ప‌త‌నాన్ని(Adani Row) ప‌రిశీలిచేందుకు న్యాయ‌మూర్తితో స‌హా నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. దీనికి స‌మాధానం ఇచ్చారు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్. అదానీకి సంబంధించి సెబీ పూర్తిగా విచార‌ణ జ‌రుపుతోంంద‌ని తెలిపారు.

Also Read : బీబీసీ మోదీ పై నిషేధం కుద‌ర‌దు

Leave A Reply

Your Email Id will not be published!