Aapne Kitne Baar Pyar : క‌విత్వం అంటే ఏమిటి – జ‌గ‌దీప్

స‌మాధానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ

Aapne Kitne Baar Pyar : రాజ్య‌స‌భ‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. తాజాగా క‌విత్వం (పోయెట్రీ) పై చ‌ర్చ జ‌రిగింది. వాస్త‌వానికి క‌విత్వం అంటే ఏమిటి అని రాజ్య‌స‌భ చైర్మ‌న్ , దేశ ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ ప్ర‌శ్నించారు. దీనిపై వాడి వేడి గా చ‌ర్చ జ‌రిగింది. కోలాహ‌లంగా జ‌ర‌గ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుడు చాలా చిలిపి ప్ర‌శ్న అడిగారు రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ ను. సార్..మీరు ఎప్పుడైనా ప్రేమ‌లో ప‌డ్డారా ..ఎప్పుడు ఎలా ప‌డ్డారో(Aapne Kitne Baar Pyar) చెప్పాల‌ని కోరాడు. దీంతో స‌భ‌లో ఎంపీలు ఒక్క‌సారిగా న‌వ్వారు.

ఇదిలా ఉండ‌గా ట్విట్ట‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు ఉప రాష్ట్ర‌ప‌తి. త‌న‌కు రోజూ ఎన్నో ట్వీట్లు వ‌స్తుంటాయ‌ని అందులో ఎక్కువ‌గా క‌విత్వాత్మ‌కంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అస్స‌లు ఈ క‌విత్వం అంటే ఏమిటి అని ప్ర‌శ్నించారు.

స‌భ్యుల‌లో ఎవ‌రైనా తెలిస్తే చెప్ప‌గ‌ల‌రా అంటూ ఆహ్లాద‌క‌రంగా ప్ర‌శ్నించారు. విచిత్రం ఏమిటంటే ఈ ట్విట్ట‌ర్ మాయాజాలం ఏమిటో అర్థం కావ‌డం లేదంటూ పేర్కొన్నారు. స‌భ‌లోని స‌భ్యులు నాకు ఏదో రాసి రెండు నిమిషాల్లో పోస్ట్ చేస్తున్నారంటూ తెలిపారు జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్.

 రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై ప్ర‌తిపక్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే చేసిన ప్ర‌సంగం లోని భాగాల‌ను ర‌ద్దు చేస్తూ చైర్మ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రేమ‌తో ఒక ప‌ద్యం రాశానంటూ స్ప‌ష్టం చేశారు. దీనికి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. క‌విత్వం ప్రేమ ఫ‌లిత‌మా లేక ప్రేమ క‌విత్వానికి దారి తీస్తుందా అని పేర్కొన్నారు.

Also Read : వీడియో రికార్డు ఎంపీ స‌స్పెండ్

Leave A Reply

Your Email Id will not be published!