Rajeev Chandrasekhar : వాస్తవాల పరిశీలనపై ప్రజాభిప్రాయం
కేంద్ర ఐటీ శాఖ మంత్రి చంద్రశేఖర్
Rajeev Chandrasekhar : వాస్తవాల పరిశీలనపై ప్రజల అభిప్రాయం ఐటీ రూల్స్ ను మరింత బలోపేతం చేస్తుందన్నారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఐటీ నిబంధనల ప్రకారం మధ్యవర్తుల ద్వారా తగిన శ్రద్దను బలోపేతం చేసే ఉద్ధేశంతో ప్రెస్ ఇన్మర్మేషన్ బ్యూరో కు సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా నకిలీగా గుర్తించిన సమాచారాన్ని గుర్తించేందుకు గాను అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నవంబర్ ,2019లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar).
ప్రభుత్వ మీడియా విభాగం పీఐబీ ఐటీ రూల్స్ ప్రకారం వాస్తవ పరిశీలన ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా పటిష్టం చేసే ఉద్దేశంతో రూపొందించడం జరిగిందని తెలిపారు.
దీనిపై ప్రజలు ఏమని అనుకుంటున్నారనే దానిపై అభిప్రాయాలను కూడా ఆహ్వానించడం జరిగిందని చెప్పారు రాజీవ్ చంద్రశేఖర్. ఇంటర్నెట్ విస్తరించడం, కోట్లాది మంది భారతీయులు నెట్ కనెక్టివిటీని కలిగి ఉండడంతో ఏది వాస్తవం ఏది నకిలీ సమాచారం అనేది గుర్తించలేక పోతున్నారని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తప్పుదారి పట్టించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం , 2000 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా మధ్యవర్తులతో సహా నిర్దిష్టమైన బాధ్యతలను విధిస్తూ ఐటీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ ) రూట్స్ , 2021 చట్టాన్ని తీసుకు వచ్చిందని వెల్లడించారు రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar) .సురక్షితమైన, విశ్వసనీయమైన , జవాబుదారీతనం ఉండేలా ఇంటర్నెట్ లక్ష్యాన్ని సాధించాలనే దీనిని తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు.
Also Read : వీడియో రికార్డు ఎంపీ సస్పెండ్