Supreme Court Victoria Gowri : జడ్జిపై తీర్పు చెప్పేది ప్రజలే
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court Victoria Gowri : న్యాయమూర్తి ప్రతిరోజూ తీర్పు చెప్పబడతారని సంచలన వ్యాఖ్యలు చేసింది భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. జస్టిస్ విక్టోరియా గౌరీకి(Supreme Court Victoria Gowri) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ముగించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. న్యాయమూర్తి ప్రవర్తన, ఆమె లేదా అతని నిర్ణయాలు ప్రజాస్వామ,రాజ్యాంగ విలువలకు స్వేచ్చ, కట్టుబడి ఉండేలా ప్రతిబింబించాలని , చూపించేలా ప్రయత్నం చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వ్యక్తుల రాజకీయ నేపథ్యాలు సరైన వ్యక్తిని నియమించడానికి సంపూర్ణ అడ్డంకి కాదని అభిప్రాయపడింది. ఒక న్యాయమూర్తిని ప్రజలు, న్యాయవాదులు ప్రతిరోజూ తీర్పు ఇస్తారని , వారి తీర్పుల ద్వారా వారు మాట్లాడేటప్పుడు వారి ప్రవర్తన ఎల్లప్పుడూ పరిశీలనలో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని నియమించాలన్న సిఫారసును సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను విచారించక పోవడానికి గల కారణాలను తెలుపుతూ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరణాత్మక కారణాలను అనుసరిస్తామని సూచించింది కోర్టు. ఇదిలా ఉండగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు మంగళవారం పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం ఇలా పేర్కొంది. ధృవీకరణ సమయంలో ఇచ్చిన ప్రవర్తన , తీర్పులను మాత్రమే పరిగణలోకి తీసుకోరు. న్యాయస్థానాలు తెరిచి ఉన్నందున , ప్రజలు రోజూ మన పట్ల తీర్పు చెబుతూనే ఉంటారని స్పష్టం చేసింది ధర్మాసనం.
Also Read : వాస్తవాల పరిశీలనపై ప్రజాభిప్రాయం