Mukhtar Abbas Naqvi : సామరస్యం భారత్ డీఎన్ఏలో ఉంది
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కామెంట్స్
Mukhtar Abbas Naqvi : సామరస్యం భారత దేశం డీఎన్ లో ఉందన్నారు కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ(Mukhtar Abbas Naqvi) . గురు రవిదాస్ బోధనలు సమాజానికి , దేశానికి అత్యంత అవసరమన్నారు. ఏక్ భారత్ ,శ్రేష్ట భారత్ నిబద్దత శాశ్వతమైన సారాంశమని స్పష్టం చేశారు. సామరస్యం, సౌభ్రాతృత్వానికి భారత దేశం యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
మత, సామాజిక సామరస్యం, లౌకిక వాదం, సహనం భారత డీఎన్ఏలో ఉన్నాయని మరోసారి కుండబద్దలు కొట్టారు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. దాదాపు అన్ని మతాల విశ్వాసులు శాంతియుతంగా జీవించే ఏకైక దేశం తమదేనని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి స్పష్టం చేశారు. సంత్ గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని భారతీయ బౌద్ సంఘ్ నిర్వహించిన సామాజిక సమరస్తా సమ్మేళనంలో శనివారం ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడారు.
కుల వ్యవస్థ దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ శతాబ్ధాల కిందట సంత్ రవిదాస్ ఇచ్చిన బలమైన సందేశం నేటికీ సంబంధించినదని నఖ్వీ అన్నారు. సంత్ రవిదాస్ బోధనలు , సందేశాన్ని సమీకరించి మోడీ ప్రభుత్వం కులం, సంఘం , ప్రాంతం , మతం అనే అడ్డంకిని బద్దలు కొట్టిందన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి పేదవారు సమానంగా అభివృద్ది ప్రయోజనాలను పొందేలా చూస్తారని చెప్పారు.
గొప్ప సాధువులు , సూఫీల బోధనలు , తత్వ శాస్త్రం బలం కారణంగా భారత దేశం మొత్తం యావత్ ప్రపంచానికి మార్గాన్ని చూపుతుందన్నారు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ(Mukhtar Abbas Naqvi) . దేశంలో సామాజిక సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వానికి విఘాతం కలిగించి , దెబ్బ తీసే కుట్రకు పాల్పడుతున్న దుష్ట శక్తులను ఓడించేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : ఈ దేశం మనందరిది – మౌలానా