Nirmala Sitharaman : క్రిప్టో కరెన్సీ నియంత్రణపై జి20 ఫోకస్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : కేంద్ర విత్త శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ నియంత్రణపై జి20 పోకస్ పెడుతుందని స్పష్టం చేశారు. నియంత్రించేందుకు లేదా నిషేధించేందుకు కూడా ఒక చట్టాన్ని రూపొందించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా చర్చలు జరుపుతోందన్నారు. ఈనెలలో జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ లకు భారత దేశం ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman).
గ్రూప్ ఆఫ్ 20 (జి20) పెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహం క్రిప్టో కరెన్సీలను సమిష్టిగా నియంత్రించగలగా అని అన్వేషిస్తోందని ఆర్థిక మంత్రి చెప్పారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అధునాతన సాంకేతికతలను బట్టి , ఇచ్చిన నియంత్రణ అవసరమా అని దేశాలు చర్చించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్.
ఇందుకు సంబంధించి అన్ని దేశాలతో మాట్లాడటం జరుగుతోందని తెలిపారు విత్త మంత్రి. నియంత్రణ అవసరమైతే ఒక్క దేశం మాత్రమే ఏమీ చేయలేమన్నారు. ఇదిలా ఉండగా న్యూ ఢిల్లీలో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్లను కలిశారు. అనంతరం దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman).
ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్లతో క్రిప్టో కరెన్సీ పై చర్చించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. సలహాలు, సూచనలు ఎప్పుడైనా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈనెలలో జీ20 ఆర్థిక మంత్రులు,సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల చీఫ్ లతో ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో క్రిప్టో కరెన్సీ పై ఏం చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : సామరస్యం భారత్ డీఎన్ఏలో ఉంది