MK Stalin PM Modi : హామీల వర్షం ఆచరణ శూన్యం – సీఎం
ప్రధాని మోదీపై స్టాలిన్ సీరియస్
MK Stalin PM Modi : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. హామీలు గుప్పించారు కానీ తమిళనాడుకు రావాల్సిన నిధులను మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. గత కొంత కాలం నుంచి ప్రత్యేకంగా తమ సర్కార్ పై కేంద్ర ప్రభుత్వం వివక్షను ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ 15 లక్షల రూపాయలు ఇస్తామన్న పీఎం మాటల వరకే పరిమితం అయ్యారని , కుర్చీలో కూర్చున్నాక మరిచి పోయారంటూ ఎద్దేవా చేశారు.
తాను ఇచ్చిన హామీల గురించి తాను ప్రస్తావించానని మోదీతో కానీ నవ్వారని ఆ తర్వాత చేయి ఊపుకుంటూ వెళ్లి పోయారంటూ ఫైర్ అయ్యారు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin). మదురైకి ఎయిమ్స్ ఇస్తామని హామీ ఇచ్చారని దాని సంగేతి ఏంటి అంటూ ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా నియమించ లేదన్నారు ఎంకే స్టాలిన్. నల్ల ధనం వెలికి తీస్తామన్నారు.
కానీ సంపదనంతా కొందరికే దోచి పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం. రూ. 15 లక్షలు కాదు కదా కనీసం రూ. 15 కూడా జమ చేయలేదని సెటైర్ వేశారు ఎంకే స్టాలిన్. ప్రాంతం, కులం, మతం పేరుతో దేశాన్ని విభజిస్తూ ఓట్లు దండుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలని, ఆ విషయం ప్రధానమంత్రి(PM Modi) తెలుసుకుంటే మంచిదన్నారు ఎంకే స్టాలిన్.
ఇదిలా ఉండగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయకుండా ఎందుకు నిలిపి వేశారంటూ ప్రశ్నించారు.
Also Read : టిప్పు సుల్తాన్ నమ్మే పార్టీలవి – షా