Ramesh Bais Governor : మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బాయిస్
బీఎస్ కోష్యారీ స్వచ్చంధ రాజీనామా
Ramesh Bais Governor : మహారాష్ట్రకు నూతన గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం రమేష్ బాయిస్ ను నియమించింది. ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోష్యారీ తాను ఇక బాధ్యతలు చేపట్టలేనని , తనకు విముక్తి కల్పించాలని రాష్ట్రంలో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి విన్నవించారు. ఈ మేరకు బదిలీ చేయాలంటూ లేఖ రాశారు. ఈ తరుణంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఇదిలా ఉండగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కురు వృద్దుడు, మాజీ సీఎం, ఎంపీ అయిన బీఎస్ కోష్యారీ 2019లో మహారాష్ట్రకు గవర్నర్ గా నియమితులయ్యారు.
కేంద్ర సర్కార్ సూచించిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్రకు రమేష్ బాయిస్(Ramesh Bais Governor) నియామకానికి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు కూడా కొత్త గా లెఫ్టినెంట్ గవర్నర్ ను కూడా నియమించారు ద్రౌపది ముర్ము. జార్ఖండ్ మాజీ గవర్నర్ గా గతంలో పని చేశారు రమేష్ బాయిస్ .
ఇదిలా ఉండగా తనకు విశ్రాంతి కావాలని అందుకే రాజీనామా చేసినట్లు చెప్పారు బీఎస్ కోష్యారీ. ఇక నుంచి తాను జీవితాంతం చదవడం, రాయడం, ఇతర విరామ కార్యక్రమాలలో గడిపేందుకు తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మరో వైపు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న కాలంలో తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు బీఎస్ కోష్యారీ.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం అయ్యాయి. రాజ్ భవన్ కు సీఎం ఉద్దవ్ ఠాక్రేకు మధ్య అగాధం పెరిగింది. ఇదే సమయంలో గత ఏడాది 2022 నవంబర్ లో ఛత్రపతి శివాజీని పాత రోజులకు చిహ్నం అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇదే ఆయన కొంప ముంచేలా చేసింది.
Also Read : క్రిప్టో కరెన్సీ నియంత్రణపై జి20 ఫోకస్