Gulab Chand Kataria : అస్సాం గవర్నర్ గా కటారియా
రాజస్థాన్ ఎన్నికల వేళ ప్రయారిటీ
Gulab Chand Kataria : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర గవర్నర్ గా భగసింగ్ కోష్యారీ స్వచ్చంధంగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జార్ఖండ్ మాజీ గవర్నర్ రమేష్ బయాస్ ను నియమించింది.
ఇక త్వరలో రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఓట్లను ప్రభావితం చేసే కమ్యూనిటీకి చెందిన గులాబ్ చంద్ కటారియాను(Gulab Chand Kataria) అస్సాం రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియమించింది. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. బీజేపీకి చెందిన మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో సంచాలకుడిగా ఉన్నారు. కాషాయ పార్టీలో అత్యంత ముఖ్యమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
గులాబ్ చంద్ కటారియా వయస్సు 78 ఏళ్లు. కాషాయ భావజాలంకు సంబంధించిన వ్యక్తి. కరుడు గట్టిన సంప్రదాయ వాదిగా పేరొందారు కటారియా. అస్సాం గవర్నర్ గా నియమితులైన కటారియా రాజస్థాన్ లోని మేవార్ వాగడ్ ప్రాంతంలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నారు. సీఎం రేసులో ప్రతిసారి ఉన్నారు. అయితే ఆయనను కాదని వసుంధరా రాజేకు ఛాన్స్ దక్కింది. అయితే హోం మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది కటారియాకు.
మేవార్ లోని 40 స్థానాల్లో గిరిజనులు, రాజ్ పుత్ లు , కటారియాకు చెందిన జైన సమాజం ప్రభావం అధికంగా ఉండడం తో ఆయనకు గవర్నర్ ఛాన్స్ దక్కింది.
Also Read : మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బాయిస్