RS Praveen Kumar KCR : ఆదివాసీలకు కేసీఆర్ సారీ చెప్పాలి
నిప్పులు చెరిగిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ
RS Praveen Kumar KCR : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి సీఎంగా ఇవాళ తెలంగాణలో కొలువు తీరారు. కేసీఆర్ దొర మనస్తత్వంతో పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు బహుజన సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
రూ. 12 వేల కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం ప్రజలు ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే పట్టించు కోవడం లేదని ఆరోపించారు. కొన్నేళ్లుగా కొన్ని తరాలుగా అడవితో అనుబంధం కలిగిన అడవి బిడ్డలను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ఆదివాసీలను అవహేళన చేశాడని, వెంటనే అడవి బిడ్డలకు క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్పీ(RS Praveen Kumar KCR) డిమాండ్ చేశారు. తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. అన్ని కోట్లతో నీకు ప్రగతి భవన్ ఎందుకు అని ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు , నియామకాల పేరుతో పవర్ లోకి వచ్చిన కేసీఆర్ మొత్తం దోచుకోవడం, దాచుకోవడానికే టైం వెచ్చిస్తున్నారంటూ ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేయడం, విద్య, వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
10 రోజుల పాటు జరిగిన అసెంబ్లీలో ఒక్కటన్నా ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించారా అని సీఎంను నిలదీశారు. ఒక రకంగా కామెడీ సినిమాను తలపింప చేసిందన్నారు. ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారా అన్న అనుమానం వ్యక్తం చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Also Read : మోదీ మాటలు పచ్చి అబద్దాలు – ఆర్ఎస్పీ