Amit Shah Adani : అదానీ వివాదం అమిత్ షా మౌనం
సమస్య కోర్టులో ఉంది..మాట్లాడ లేను
Amit Shah Adani : భారతీయ జనతా పార్టీకి అదానీకి దగ్గరి సంబంధం ఉందని, వెంటనే విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు పట్టు పటుడుతుండడం, మరో వైపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై తీవ్రంగా స్పందించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
ఇది దాచాల్సిన విషయం కాదన్నారు. అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కలుస్తూ ఉంటారు. మా లక్ష్యం ఒక్కటే సమున్నత భారత దేశాన్ని అగ్ర భాగాన నిలపాలని, ఆ దిశగా మేం ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు అమిత్ షా(Amit Shah Adani).
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను వాస్తవం కాదన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిందని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకుందన్నారు. తమకు సంబంధం ఉందంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే చూపాలని స్పష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి. ఇందులో దాచేందుకు ఏముందని అంతా పారదర్శకంగానే ఉంటుందన్నారు.
అదానీ హిండెన్ బర్గ్ వివాదం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానంలో ఉంది. దీనిపై బాధ్యత కలిగిన మంత్రిగా తాను స్పందించడం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదన్నారు. అందుకే తాను మౌనం వహించడం తప్ప మాట్లాడలేనంటూ స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా(Amit Shah Adani).
ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎలాంటి భయాందోళనకు గురి కావడం లేదని కుండ బద్దలు కొట్టారు . విచారణ కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు ట్రబుల్ షూటర్.
Also Read : జి20 సమ్మిట్ క్రెడిట్ మోదీదే – షా