Amit Shah 2024 Elections : 2024 ఎన్నికల్లో బీజేపీకి పోటీ లేదు – షా
కాంగ్రెస్ పార్టీ మాకు పోటీనే కాదు
Amit Shah 2024 Elections : బీజేపీ ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాబోయే 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల గురించి కీలక ప్రకటన చేశారు. ఇందులో తమ పార్టీకి తిరుగే లేదన్నారు. తాము కాంగ్రెస్ పార్టీని పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పారు.
మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇక గతించిన పార్టీగా ఆయన అభివర్ణించారు. తమకు తిరుగే లేదని, మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర దాస్ మోదీ కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు అమిత్ షా(Amit Shah 2024 Elections).
తాము ఎన్నికల గురించి ఆందోళన పడడం లేదన్నారు. ఆ దిగులు మిగతా పార్టీలకు ఉంటాయన్నారు. గతంలో సాధించిన సీట్ల కంటే మరిన్ని సీట్లు గెలుస్తామని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఇవాళ భారత దేశం వైపు ప్రపంచం చూస్తోందన్నారు.
ఈ ఘనత అంతా కేవలం నరేంద్ర మోదీ వల్లనే, ఆయన సమర్థవంతమైన నాయకత్వం కారణంగా వచ్చిందన్నారు అమిత్ షా. అందుకే ప్రధానమంత్రిని మోస్ట్ పవర్ లీడర్ గా ప్రపంచం గుర్తించిందని కొనియాడారు.
దేశం మొత్తం హృదయ పూర్వకంగా ప్రధానమంత్రితో కదులుతోందని, ఆయనే మరోసారి పీఎం కావాలని కోరుకుంటోందని చెప్పారు అమిత్ షా. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని వారి తీర్పు అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పగలనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి.
Also Read : మోదీ బీబీసీ..అదానీపై వివరణ ఏది