Union HM Amit Shah : మొఘల్ చరిత్రను మార్చలేదు – షా
ఆయా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం
Union HM Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చరిత్రను చెరిపి వేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలై తీవ్రంగా స్పందించారు. నగరాల పేరు మార్చడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ చట్ట బద్దమైన హక్కుల పరిధిలోనే చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాయని స్పష్టం చేశారు అమిత్ షా. చరిత్రను తిరగ రాసేందుకు బీజేపీ ప్రయత్నం చేయడం లేదన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. త్రిపురలో మంగళవారం పర్యటించిన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నిజమైన చరిత్ర ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు అమిత్ షా(Union HM Amit Shah).
చట్ట బద్దమైన హక్కుల ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకున్నాయని ఇందులో ఎలాంటి పరిమితులు దాటలేదని అన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి. అయితే చరిత్రలో ఎవరి సహకారాన్ని తొలగించాలని బీజేపీ కోరుకోవడం లేదని చెప్పారు అమిత్ షా.
దేశ చరిత్రను తిరగ రాసేందుకు ప్రయత్నం చేయాలని అనుకోవడం లేదు. మొఘల్ చరిత్రతో ముడిపడి ఉన్న నగరాల పేర్లను మార్చాలని యోచిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు హోం శాఖ మంత్రి. గతంలో పాత పేరు లేని ఒక్క నగరం పేరు కూడా తాము మార్చ లేదని అన్నారు అమిత్ షా(Union HM Amit Shah).
గతంలో పాత పేరు లేని ఒక్క నగరం పేరు కూడా మేము మార్చలేదు. తమ ప్రభుత్వాలు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రతి ప్రభుత్వానికి దాని చట్ట బద్దమైన హక్కులు ఉన్నాయన్నారు.
Also Read : ప్రచార ఆర్భాటం పాలన అస్తవ్యస్తం