Jairam Ramesh Modi Campaign : ప్రచార ఆర్భాటం పాలన అస్తవ్యస్తం
కాంగ్రెస్ నేత జై రాం రమేష్
Jairam Ramesh Modi Campaign : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీరియస్ గా స్పందించింది కాంగ్రెస్ పార్టీ. బెంగళూరులో ఏరో ఇండియా 2023ని మోదీ ప్రారంభించారు. దీనిని తానే చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్.
బెంగళూరులో ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హయాంలో సంస్థలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏరో ఇండియాను తానే తయారు చేసినట్లు గ్లోబెల్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏరో ఇండియాను 1996లో ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.
కేవలం ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన సంస్థలు అభివృద్ది చెందవన్నారు. బెంగళూరు శివార్ల లోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కాంప్లెక్స్ లో 14వ ఏరో ఇండియా ఎడిషన్ ను ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించారు. దీనిపై తీవ్రంగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ.
ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మీడియా ఇన్ ఛార్జ్ జైరామ్ రమేష్(Jairam Ramesh Modi Campaign) సీరియస్ గా కామెంట్స్ చేశారు. ఏం సాధించారని దీనిని తమదిగా భావిస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు.
ట్విట్టర్ వేదికగా జైరామ్ రమేష్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నెహ్రూవియన్ యుగం నుండి వారి మూలాలను గుర్తించే సంస్థలు బెంగళూరులో కొలువు తీరి ఉన్నాయి. తమ ప్రభుత్వం వాటి ప్రాధాన్యతను గమనించి వీటి ఏర్పాటుకు సపోర్ట్ చేసిందన్నారు. కానీ ఇవాళ తానే వైమానిక దళాలను తయారు చేసినట్లు కవరింగ్ ఇస్తున్నారంటూ ఆరోపించారు జైరాం రమేష్.
Also Read : మోదీ శక్తిని చూసి విస్తు పోయా – సిఇఓ