TMC Congress IT Raids BBC : భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి
కాంగ్రెస్..టీఎంసీ ఆగ్రహం
TMC Congress IT Raids BBC : కేంద్ర ఆదాయపు పన్ను శాఖ మంగళవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి. ఏక కాలంలో ఢిల్లీ, ముంబై ఆఫీసులలో సోదాలు చేపట్టింది. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. సిబ్బంది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బయటకు పంపింది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా ఇటీవలే మోదీ ది క్వశ్చన్ పేరుతో సంచలన డాక్యుమెంటరీ బీబీసీ ప్రసారం చేసింది.
దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రధానంగా భారత దేశంలో హిందూ వాదులు, పార్టీలు, కాషాయ సంస్థలు భగ్గుమన్నాయి. ఇది మోదీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే ఇలా చేసిందంటూ బీబీసీపై మండిపడ్డాయి. కోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. వెంటనే బీబీసీని నిషేధించాలని, జోక్యం చేసుకున్న కోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఈ తరుణంలో సోదాలు చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది(TMC Congress IT Raids BBC).
ఒక రకంగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని, భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేయడమేనని పేర్కొంది. మరో వైపు ఈ వీడియోను కేంద్రం నిషేధం విధించింది. యూట్యూట్ , ట్విట్టర్ , తదితర సామాజిక మాధ్యమాలలో పూర్తిగా బ్లాక్ చేసింది. సోదాలలో భాగంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహూవా మోయిత్రా కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై(TMC Congress IT Raids BBC) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో వైపు బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు, రికార్డులు తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Also Read : బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు