Arvind Kejriwal BBC : పత్రికా స్వేచ్ఛపై దాడి – కేజ్రీవాల్
బీబీసీ ఆఫీసులపై ఐటీ సోదాలపై సీఎం
Arvind Kejriwal BBC : మోదీ ది క్వశ్చన్ పేరుతో బీబీసీ లో వచ్చిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. వెంటనే నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది కావాలని మోదీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు చేసిన ప్రయత్నం అంటూ విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి ఫిబ్రవరి 14, 15న రెండు రోజుల పాటు కేంద్ర ఆదాయ పన్ను శాఖ మెరుపు దాడులు చేసింది బీబీసీకి చెందిన ఆఫీసులపై. ఢిల్లీ, ముంబైలలో వరుస సోదాలు చేస్తూ వచ్చింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ , టీఎంసీ ఎంపీలు జైరాం రమేష్ , మహూవా మోయిత్రా సీరియస్ గా స్పందించారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం మోదీపై నిప్పులు చెరిగారు. ఇవాళ బీబీసీపై దాడి చేశారు..మరి గౌతం అదానీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన అమెరికా కు చెందిన రీసెర్చ్ గ్రూప్ హిండెన్ గ్రూప్ పై కూడా ఇలాగే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఈ తరుణంలో బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal BBC) నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంపై దాడిగా, పత్రికా స్వేచ్ఛపై జరిగిన మూకుమ్మడి దాడిగా అభివర్ణించారు అరవింద్ కేజ్రీవాల్. ఐటీ పేరుతో ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, డెస్క్ టాప్ లు ఎలా తీసుకు వెళతారంటూ ప్రశ్నించారు సీఎం. ఇది పూర్తిగా రాచరిక పాలనను గుర్తు చేస్తోందంటూ ధ్వజమెత్తారు ఆప్ చీఫ్. ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభమని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం.
Also Read : కేరళ..కర్ణాటకలో ఎన్ఐఏ దాడులు